breaking news
Feroz Shah Kotla Grounds
-
టీమిండియా జెర్సీ, బ్యాట్, వరల్డ్ కప్ టికెట్!
న్యూఢిల్లీ: ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ టూర్లో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించిన మెస్సీ అభిమానులకు వీడ్కోలు పలుకుతూ స్వదేశం బయల్దేరాడు. చివరి రోజు సోమవారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మెస్సీ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ముంబైల తరహాలోనే ఇక్కడి షో కూడా సరదాగా సాగింది. అభిమానుల మధ్య దాదాపుగా అవే దృశ్యాలు ఇక్కడా పునరావృతమయ్యాయి. చిరునవ్వుతో తిరుగుతూ అభివాదం చేసిన అతను ఆ తర్వాత 7x7 సెలబ్రిటీ మ్యాచ్‌ను తిలకించాడు. సహచరులు స్వారెజ్, రోడ్రిగోలతో కలిసి మెస్సీ తన కిక్‌లతో కొన్ని బంతులను స్టాండ్స్‌లోకి పంపించడంతో ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జై షా పాల్గొన్న కార్యక్రమం విశేషంగా నిలిచింది. మెస్సీ, స్వారెజ్, రోడ్రిగోల పేర్లు, నంబర్లు రాసి ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రత్యేక ‘బ్లూ’ జెర్సీలను వారికి కానుకగా ఇవ్వడంతో పాటు 2024 టి20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల సంతకాలతో కూడిన ప్రత్యేక బ్యాట్‌ను కూడా బహుకరించారు. భారత్‌లో జరిగే 2026 టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ (భారత్ x అమెరికా) టికెట్‌ను కూడా మెస్సీకి జై షా ఇచ్చారు. ప్రధానితో భేటీ లేదు... ఢిల్లీ కార్యక్రమంలో ముందుగా అనుకున్న విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలవలేదు. వీరిద్దరి భేటీ కోసం ప్రత్యేకంగా 21 నిమిషాల ప్రొటోకాల్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. అయితే ప్రధాని జోర్డాన్ పర్యటనకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ‘మళ్లీ వస్తా’ భారత్‌లో నాకు లభించిన ప్రేమాభిమానాలకు ఎంతో కృతజు్ఞడను. ఈ పర్యటన చిన్నదే కావచ్చు కానీ నిజంగా చాలా గొప్ప అనుభవం. నన్ను ఇక్కడి వాళ్లు ఎంతో అభిమానిస్తారని వింటూ వచ్చిన మాటలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాతో వ్యవహరించిన తీరు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మీ ప్రేమను మాతో పాటు తీసుకెళుతున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడికి తిరిగి వస్తాను. అది మ్యాచ్ ఆడటానికి కావచ్చు లేదా మరో సందర్భం కావచ్చు కానీ భారత్‌లో మాత్రం మళ్లీ అడుగు పెడతా. అందరికీ కృతజ్ఞతలు. –మెస్సీ -
Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా!
India Vs South Africa 2022 T20 Series- న్యూఢిల్లీ: రాబోయే టి20 ప్రపంచకప్ కోసం కాబోయే టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు భారత బోర్డు ఈ సీజన్లో ఎక్కువగా పొట్టి మ్యాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టు గట్టి ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో ఐదు పొట్టి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. అయితే ఒక రోజు ముందే టీమిండియా స్థయిర్యానికి గాయాలు పరీక్ష పెట్టాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేని ఈ సిరీస్‌కు సరైన నాయకుడిగా భావించి కేఎల్ రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తే అతను గాయంతో ఉన్నపళంగా సిరీస్ మొత్తానికి దూరం కావడం జట్టుకు షాక్ ఇచ్చింది. మరోవైపు స్టార్లు, సత్తాగల అనుభవజ్ఞులతో సఫారీ జట్టు సవాలు విసురుతోంది. ఆశలన్నీ కుర్రాళ్లపైనే... కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, స్టార్ టాపార్డర్ కోహ్లి, సీనియర్ సీమర్ బుమ్రాలకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. తాజాగా రాహుల్, కుల్దీప్లు కూడా అనూహ్యంగా దూరమవడం జట్టు మేనేజ్మెంట్ను కలవరపెట్టే అంశమైనా... యువ ఆటగాళ్లకు మాత్రం ఇది లక్కీ చాన్స్! రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌లో సత్తా చాటుకునేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది. ఆల్‌రౌండర్లు దీపక్ హుడా, హర్షల్ పటేల్‌లతో పాటు అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తుది జట్టులో స్థానాలు దాదాపు ఖాయం. ఈ నేపథ్యంలో టీమిండియా పూర్తిగా యువరక్తంతోనే పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్, అనుభవజ్ఞుడైన హార్దిక్ పాండ్యా మార్గదర్శనం చేస్తే యువకులు మెరుపులు మెరిపిస్తారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆస్ట్రేలియాకు పయనమయ్యే ప్రపంచకప్ జట్టు రేసులో ఉంటారు. శుభారంభంపై దక్షిణాఫ్రికా కన్ను సీనియర్లు లేని ఆతిథ్య జట్టును కొత్తగా గాయాలు వేధిస్తుండటంతో అన్నీ అనుకూలతలతో తొలి మ్యాచ్ నుంచే పైచేయి సాధించాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా ఉంది. తెంబా బవుమా సారథ్యంలోని ప్రొటీస్ సభ్యుల్లో డికాక్, మిల్లర్, రబడ, నోర్జే ఇటీవలే భారత్‌లో ఐపీఎల్ ఆడారు. బ్యాటింగ్‌లో మిల్లర్, డికాక్, బౌలింగ్‌లో రబడ, నోర్జే మెరుగ్గానే రాణించారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పిచ్ కూడా పేస్‌కు కాస్త అనుకూలంగా ఉండటంతో రబడ, నోర్జేలు చెలరేగే అవకాశముంది. ఊరించే రికార్డు టి20 క్రికెట్లో టీమిండియా గత 12 మ్యాచ్‌ల్లో విజయాలతో అజేయంగా ఉంది. ఈ వరుసలో అఫ్గానిస్తాన్, రొమేనియాలు 12 విజయాలతో ఉన్నాయి. తొలి టి20లో సఫారీని ఓడిస్తే 13 వరుస విజయాల జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది. We have a challenge ahead of us against a strong South African side: #TeamIndia Head Coach Rahul Dravid 💪#INDvSA | @Paytm pic.twitter.com/AFaZ2XTuNn — BCCI (@BCCI) June 7, 2022 .@RishabhPant17 takes us through his emotions on leading #TeamIndia. 👍 👍#INDvSA | @Paytm pic.twitter.com/EVS59jHtMw — BCCI (@BCCI) June 8, 2022 -
ఫలితాన్ని టాస్ నిర్దేశిస్తుంది
సంజయ్ మంజ్రేకర్ ఫామ్‌ను కొలమానంగా తీసుకుంటే మాత్రం తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టే ఫేవరెట్. కానీ టి20 క్రికెట్లో ఏదీ సులభం కాదు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టాస్‌ది కీలక పాత్ర. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయాలని భావిస్తుంది. కోట్లా పిచ్‌లో మొదటి ఇన్నింగ్స్ సమయంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో స్పిన్నర్లకు, పేసర్లకు కూడా ఎలాంటి సహకారం ఉండదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా శ్రీలంక కోలుకోవడానికి కారణం కూడా ఇదే. భారత్‌లోని పిచ్‌ల మీద ఉపఖండ స్పిన్నర్ల తరహాలో శాంట్నర్, సోధి బౌలింగ్ చేస్తున్నారు. ఒకవేళ న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేరు. కేవలం స్పిన్నర్ల కారణంగానే న్యూజిలాండ్ టోర్నీలో అన్ని మ్యాచ్‌లూ గెలిచింది. ఇక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. అందుకే న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ చేసి స్పిన్ ఆయుధంతోనే వీరిని ఆపాలి. న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉన్నా, ఇంగ్లండ్ జట్టులో హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు. అన్ని పిచ్లకూ సరిపోయే బౌలింగ్ వనరులు ఉండటం న్యూజిలాండ్ బలం. ఈ అంశంలో ఇంగ్లండ్ బలహీనంగానే ఉంది. కాబట్టి కివీస్ మెరుగైన జట్టుగా కనిపిస్తున్నా... ఈ మ్యాచ్ ఫలితాన్ని టాస్ నిర్దేశిస్తుంది. -
కోట్లాలో సెమీస్ మ్యాచ్ అనుమానమే!
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగేది అనుమానంగా మారింది. స్టేడియంలో 1800 సీట్ల సామర్థ్యం ఉన్న ఆర్పీ మెహ్రా బ్లాక్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా అమ్మలేదు. దీనికోసం ఐసీసీ ఆదివారం వరకే గడువునిచ్చింది. ఆ బ్లాక్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ బెంగళూరుకు తరలితే డీడీసీఏ రూ.4 కోట్లు నష్టపోతుంది. ‘ఇప్పటిదాకా అయితే వేదిక మార్పు గురించి ఐసీసీ, బీసీసీఐ నుంచి మాకు సమాచారం లేదు’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారి అన్నారు.


