కన్వల్జిత్‌సింగ్‌కు చుక్కెదురు | High court forwards notice for Kanwaljit Singh | Sakshi
Sakshi News home page

కన్వల్జిత్‌సింగ్‌కు చుక్కెదురు

Feb 15 2014 12:06 AM | Updated on Sep 4 2018 5:07 PM

రంజీ మాజీ ఆటగాడు కన్వల్జిత్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) డెరైక్టర్ పదవి నుంచి తనను తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

సాక్షి, హైదరాబాద్: రంజీ మాజీ ఆటగాడు కన్వల్జిత్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) డెరైక్టర్ పదవి నుంచి తనను తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే కన్వల్జిత్ సింగ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు శివలాల్‌యాదవ్ సోదరుడు వీరేందర్ యాదవ్ మధ్య జరిగిన వివాదంపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఈ వ్యవహారంపై ఏర్పాటైన కమిటీని ఆదేశించింది.
 
 నివేదిక ఆధారంగా బాధ్యులపై రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం  సంబంధిత అధికారులను ఆదేశించింది. హెచ్‌సీఏఈ డెరైక్టర్ పదవి నుంచి తనను తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, హెచ్‌సీఏఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా హెచ్‌సీఏను ఆదేశించాలంటూ కన్వల్జిత్‌సింగ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement