ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌: కుల్దీప్‌ యాదవ్‌ | This hat-trick tops my list, Says Kuldeep Yadav | Sakshi
Sakshi News home page

ఇదే నా బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌: కుల్దీప్‌ యాదవ్‌

Dec 19 2019 1:05 PM | Updated on Dec 19 2019 1:09 PM

This hat-trick tops my list, Says Kuldeep Yadav - Sakshi

విశాఖపట్నం: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో తాను హ్యాట్రిక్‌ వికెట్లు సాధించడంపై టీమిండియా స్పిన్‌ బౌలన్‌ కుల్దీప్‌ యాదవ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అని, ఫామ్‌ కోల్పోయి.. జట్టు నుంచి స్థానం కోల్పోయి.. ఎట్టకేలకు తిరిగి జట్టులోకి వచ్చిన కుల్దీప్‌.. ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్‌ ప్రదర్శన తన కెరీర్‌లోనే ఉత్తమమైనదని కితాబిచ్చాడు. 

2017-19 వరకు టీమిండియాలో సుస్థిర ఆటగాడిగా ఉంటూ వస్తున్న కుల్దీప్‌.. వన్డే వరల్డ్‌ కప్‌లో పేలవంగా ఆడటం, ఆ తర్వాతి ఐపీఎల్‌లో రాణించకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. జట్టులోకి వస్తూ పోతూ ఉండటమే కాక నాలుగు నెలలు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ నాలుగు నెలల కాలంలో ఎంతో మెరుగైన కుల్దీప్‌ బుధవారం నాటి మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 

‘గత పది నెలలు నాకు గడ్డుకాలమే అని చెప్పాలి. కన్సిస్టెంట్‌ పర్ఫార్మెన్స్‌ ఇస్తూ వచ్చిన నాకు  ఈ ఫేజ్‌లో వికెట్లు రావడం కష్టంగా మారింది. నా బౌలింగ్‌ గురించి మరోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరల్డ్‌ కప్‌ తర్వాత నేను జట్టులో స్థానం కోల్పోయాను. ఈ నాలుగు నెలల కాలంలో ఎంతో కష్టపడ్డాను’ అని తెలిపారు. నాలుగు నెలల బ్రేక్‌ తర్వాత ముంబైలో వెస్టిండీస్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌తో మళ్లీ టీమిండియాలోకి వచ్చిన కుల్దీప్‌.. కమ్‌బ్యాక్‌ కొంచెం నెర్వెస్‌గానే అనిపించిందని, అంతర్జాతీయ మ్యాచ్‌లకు కొంత దూరంగా ఉన్న భావన కలిగించిందని తెలిపాడు. తాజా హ్యాట్రిక్‌ తన కెరీర్‌లో పర్ఫార్మెన్స్‌పరంగా ఉత్తమమైనదని, ఎంతో ఒత్తిడిలో ఉండి.. దీనిని సాధించానని, నాలుగైదు నెలల కష్టఫలం ఇదని కుల్దీప్‌ వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement