‘జోఫ్రా ఆర‍్చర్‌ మా క్రికెటరే’

Eng vs NZ: Archer Is Part Of Our Team Giles - Sakshi

మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌పై చేసిన జాత్యహంకర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. చాలా కాలంగా వినపడని వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ క్రికెట్‌లో వినిపించడం కలవరపెడుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆర్చర్‌ టార్గెట్‌ చేస్తూ పలువురు జాత్యంకార వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఆర్చర్‌ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు తెలియజేయడంతో సదరు పెద్దలు దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. ఆర్చర్‌పై జాత్యహంకర వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, అందుకు తాము క్షమాపణ చెబుతున్నామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ పేర్కొన్నప్పటికీ ఇంగ్లండ్‌ మాత్రం కాస్త గుర్రుగానే ఉంది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ మాట్లాడుతూ.. ‘ ఇది నిజంగా చాలా దురదృష్టకరం. మన సమాజంలో ఈ తరహా వ్యాఖ్యలు ఇంకా వినిపించడం సిగ్గుచేటు.

స్టేడియంలోని కొంతమంది ఆర్చర్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగారు. స్కోరు బోర్డు ఏరియాకు సమీపంలో  కూర్చొని ఉన్న పలువురు ఆర్చర్‌ను దూషించారు. ఇది చాలా నేరం. ఈ విషయంలో ఆర్చర్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. నాపై జాత్యహంకర వ్యాఖ్యలు చేసి అవమానించారని ఆర్చర్‌ ట్వీట్‌ చేయడం చాలా బాధనిపించింది. ఆర్చర్‌ మా జట్టులో సభ్యుడే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. క్రికెట్‌లో జాత్యహంకర వ్యాఖ్యలకు చోటు లేదు. ఆర్చర్‌కు మేము అండగా ఉంటాం’ అని గైల్స్‌ పేర్కొన్నాడు. బార్బోడాస్‌కు చెందిన ఆర్చర్‌.. ఇంగ్లండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతంలో వెస్టిండీస్‌ తరఫున జూనియర్‌ స్థాయిలో క్రికెట్‌ ఆడిన ఆర్చర్‌.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఆడటానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌తోపాటు యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ గెలిచిన మ్యాచ్‌ల్లో ఆర్చర్‌ కీలక పాత్ర పోషించాడు.  ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top