
న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని భవిష్యత్తుపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోనీ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదని అన్నారు. రెండు వారాల పాటు మిలిటరీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విరామం తర్వాత ధోని శరీరం సహరిస్తుందో లేదో అతనికే తెలియాలన్నారు. వెటరన్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో జరిగే టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లకు అవకాశమివ్వనున్నట్లు టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని రవిశాస్త్రి గుర్తు చేశారు. ఇప్పటి వరకు 94టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఎంత మంది రిటైరయ్యారని విలేకర్లను ప్రశ్నించారు.
ధోనీ 2020 ఐపీఎలో ఆడుతాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోనీ ప్రశాంత మనస్సుతో సాధన చేస్తే రాబోయే టీ20వరల్డ్ కప్‌లో అతన్ని ఎవరూ ఆపలేరని రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో గమనించినట్లయితే మిడిల్ ఆర్డర్‌లో అద్భుత నైపుణ్యమున్న క్రికెటర్లు దేశంలో ఎందరో ఉన్నారని రవిశాస్త్రి అన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ప్రచారంలో పోల్గొన్న ధోనిని విలేకర్లు పలు ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పటానికి ఆయన సుముఖత తెలుపలేదు. ఆ ప్రశ్నలను సున్నితంగా తిరస్కరిస్తూ.. తనను జనవరి 2020వరకు ఏమీ అడగవద్దని అన్నారు.