ధోనికి చోటు.. కోహ్లికి నో చాన్స్‌! | Dean Jones Picks Dream T20 side Includes Dhoni | Sakshi
Sakshi News home page

ధోనికి చోటు.. కోహ్లికి నో చాన్స్‌!

Aug 11 2019 4:01 PM | Updated on Aug 11 2019 8:25 PM

Dean Jones Picks Dream T20 side Includes Dhoni - Sakshi

మెల్‌బోర్న్‌: తమ కలల జట్టు ఇదేనంటూ ప్రకటించడం మాజీ క్రికెటర్లకు ఓ సరదా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన ఎలెవన్‌ ఇదేనంటూ వార్తల్లో నిలుస్తారు. ఎప్పుడూ వివాదాలను వెంట మోసుకుని తిరిగే ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ తన డ్రీమ్‌ టీ20 జట్టును తాజాగా ప్రకటించాడు. ఇందులో అసలు టీ20 ఫార్మాట్‌తో పరిచయం లేని దిగ్గజ క్రికెటర్లను మరీ ఎంపిక చేశాడు జోన్స్‌.

అయితే టీ20 క్రికెట్‌తో సంబంధం లేకపోయినా వారు పరిస్థితులకు తగ్గట్టు ఆడే ఆటగాళ్లుగా భావించే ఒక జట్టును ఎంపిక చేసుకున్నాడు. ఇక్కడ ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌తో పాటు విండీస్‌ మాజీ ఓపెనర్‌ గోర్డన్‌ గ్రీనిడ్జ్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఇక మూడో స్థానంలో వివ్‌ రిచర్డ్స్‌కు చోటిచ్చాడు. బ్రియాన్‌ లారా, ఎంఎస్‌ ధోని, మార్టిన్‌ క్రోలను మిడిల్‌ ఆర్డర్‌లో ఎంచుకున్నాడు. కాగా, భారత్‌ నుంచి ఒకే ఒక్క ఆటగాడు ధోనిని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేసిన జోన్స్‌.. విరాట్‌ కోహ్లికి చాన్స్‌ ఇవ్వలేదు.

జోన్స్‌ డ్రీమ్‌ టీ20 జట్టు ఇదే..

మాథ్యూ హేడెన్‌, గ్రీనిడ్జ్‌, వివ్‌ రిచర్డ్స్‌, బ్రియాన్‌ లారా, మార్టిన్‌ క్రో, ఇయాన్‌ బోథమ్‌, ఎంఎస్‌ ధోని, షేన్‌ వార్న్‌, వసీం అక్రమ్‌, ఆంబ్రోస్‌, జోయల్‌ గార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement