మన క్రికెట్‌ మహిళా సైన్యం...

Career Bio Data Of Womens Cricket Team Of India - Sakshi

భారత మహిళలు గర్జించే రోజు వచ్చేసింది. కంగారూ జట్టును కంగారెత్తించి తొలిసారి విశ్వకిరీటం సొంతం చేసుకునేందుకు భారత బృందం విజయం దూరంలో ఉంది. లీగ్‌ దశ నుంచి అజేయంగా దూసుకుపోతున్న 15 మంది సభ్యుల భారత్‌ బృందంలో 9 మంది భారత్‌ ఆడిన 4 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. స్మృతి మంధాన అనారోగ్యం కారణంగా 3 మ్యాచ్‌లకే పరిమితమవగా, ఆమె స్థానంలో రిచా ఘోష్‌ ఆడింది. హైదరాబాద్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆమె స్థానంలో స్పిన్నర్‌ రాధా యాదవ్‌కు మరో 2 మ్యాచ్‌లలో అవకాశం కల్పించారు. ఇద్దరు ప్లేయర్లు హర్లీన్‌ డియోల్, పూజ వస్త్రకర్‌లకు మాత్రం మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. జగజ్జేతగా నిలిచేందుకు గెలుపు దూరంలో ఉన్న భారత బృందానికి సంబంధించిన క్లుప్త సమాచారం...

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్, బ్యాటర్‌) 

వయసు: 31 ఏళ్లు
స్వస్థలం: మోగా (పంజాబ్‌) 
అనుభవం: 113 టి20లు (2009లో అరంగేట్రం) 
విశేషాలు: 2016 నుంచి జట్టు సారథిగా ఉంది. గత టి20 ప్రపంచ కప్‌ టోర్నీలో సెమీస్‌ వెళ్లినప్పుడు కూడా కెప్టెన్‌గా వ్యవహరించింది.

స్మృతి మంధాన (బ్యాటర్‌) 

వయసు: 23 ఏళ్లు
స్వస్థలం: సాంగ్లి (మహారాష్ట్ర) 
అనుభవం: 74 టి20లు (2013లో అరంగేట్రం) 
విశేషాలు: జట్టులో టాప్‌ బ్యాటర్‌. ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన అనుభవముంది.

జెమీమా రోడ్రిగ్స్‌ (బ్యాటర్‌)
 
వయసు: 19 ఏళ్లు
స్వస్థలం: ముంబై 
అనుభవం: 43 టి20లు (2018లో అరంగేట్రం) 
విశేషాలు: జట్టులో ప్రధాన బ్యాటర్‌. దేశవాళీ వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఘనత. గత ప్రపంచకప్‌లో స్టాండవుట్‌ ప్లేయర్‌గా ఎంపిక.

తానియా భాటియా (వికెట్‌కీపర్‌) 

వయసు: 22 ఏళ్లు
స్వస్థలం: చండీగఢ్‌  
అనుభవం: 49 టి20లు (2018లో అరంగేట్రం) 
విశేషాలు: 13 ఏళ్లకే పంజాబ్‌ సీనియర్‌ టీమ్‌లో ఆడింది. కీపింగ్‌ నైపుణ్యంతో జట్టులో రెగ్యులర్‌ సభ్యురాలు.

శిఖా పాండే (పేస్‌ బౌలర్‌)

వయసు: 31 ఏళ్లు
స్వస్థలం: గోవా 
అనుభవం: 49 టి20లు (2014లో అరంగేట్రం) 
విశేషాలు: ఈ ప్రపంచకప్‌లో ఓపెనింగ్‌ బౌలర్‌గా కీలక పాత్ర పోషించింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌గా పని చేస్తోంది.

పూనమ్‌ యాదవ్‌ (లెగ్‌స్పిన్నర్‌)
 
వయసు: 28 ఏళ్లు
స్వస్థలం: ఆగ్రా (ఉత్తర ప్రదేశ్‌) 
అనుభవం: 66 టి20లు (2013లో అరంగేట్రం) 
విశేషాలు:  ఈ ఏడాది బీసీసీఐ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక. గుగ్లీలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే నైపుణ్యం సొంతం.

అరుంధతి రెడ్డి (పేసర్‌) 

వయసు: 22 ఏళ్లు
స్వస్థలం: హైదరాబాద్‌ 
అనుభవం: 20 టి20లు (2018లో అరంగేట్రం) 
విశేషాలు: తెలుగు రాష్ట్రాలనుంచి భారత జట్టులో ఉన్న ఏకైక ప్లేయర్‌. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రాణించింది.

హర్లీన్‌ డియోల్‌ (ఆల్‌రౌండర్‌)

వయసు: 21 ఏళ్లు
స్వస్థలం: చండీగఢ్‌  
అనుభవం: 6 టి20లు (2019లో అరంగేట్రం) 
విశేషాలు: దూకుడులో జూనియర్‌ హర్మన్‌గా గుర్తింపు ఉంది. దేశవాళీలో హిమాచల్‌కు ఆడుతుంది. వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌ దక్కలేదు

షఫాలీ వర్మ (బ్యాటర్‌)

వయసు: 16 ఏళ్లు
స్వస్థలం: రోహ్‌టక్‌ (హరియాణా) 
అనుభవం: 18 టి20లు (2019లో అరంగేట్రం) 
విశేషాలు:  సంచలన ప్రదర్శనతో ఐసీసీ నంబర్‌వన్‌ ర్యాంక్‌. ఈ టోర్నీలో భారత టాప్‌ స్కోరర్‌.

దీప్తి శర్మ (ఆల్‌రౌండర్‌) 

వయసు: 22 ఏళ్లు
స్వస్థలం: ఆగ్రా (ఉత్తరప్రదేశ్‌) 
అనుభవం: 47 టి20లు (2014లో అరంగేట్రం) 
విశేషాలు: వన్డేల్లో ప్రపంచ రికార్డు పార్ట్‌నర్‌షిప్‌లో భాగస్వామి. వన్డేల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (188) సాధించిన ఘనత.

వేద కృష్ణమూర్తి (బ్యాటర్‌)

వయసు: 27 ఏళ్లు
స్వస్థలం: చిక్‌మగళూరు (కర్ణాటక) 
అనుభవం: 75 టి20లు (2011లో అరంగేట్రం) 
విశేషాలు: దూకుడుగా ఆడగల సమర్థురాలు. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ కూడా.

రాధ యాదవ్‌ (లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌)

వయసు: 20 ఏళ్లు
స్వస్థలం: ముంబై 
అనుభవం: 34 టి20లు (2018లో అరంగేట్రం) 
విశేషాలు:  నిలకడగా వికెట్లు తీసే బౌలర్‌. కూరగాయలు అమ్మే తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.

రాజేశ్వరి గైక్వాడ్‌ (లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌) 

వయసు: 28 ఏళ్లు
స్వస్థలం: బిజాపూర్, కర్ణాటక 
అనుభవం: 27 టి20లు (2014లో అరంగేట్రం) 
విశేషాలు: నాలుగు మ్యాచుల్లోనూ రాణించింది. భారత్‌ తరఫున వన్డే వరల్డ్‌ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన రికార్డు.

రిచా ఘోష్‌ (బ్యాటర్‌) 

వయసు: 16 ఏళ్లు
స్వస్థలం: సిలిగురి (పశ్చిమ బెంగాల్‌) 
అనుభవం: 2 టి20లు (ముక్కోణపు టోర్నీలో అరంగేట్రం చేసి, ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌ ఆడింది)  
విశేషాలు: దూకుడుగా ఆడగల మరో టీనేజర్‌.

పూజ వస్త్రకర్‌ (పేసర్‌) 

వయసు: 20 ఏళ్లు
స్వస్థలం: షహ్‌దోల్‌ (మధ్య ప్రదేశ్‌) 
అనుభవం: 20 టి20లు (2018లో అరంగేట్రం) 
విశేషాలు: పేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా... వరుస గాయాలతో కెరీర్‌ నిలకడగా సాగలేదు. గత ప్రపంచకప్‌ ఆడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top