ముంబై గరుడకు రెండో విజయం | Bengaluru Yodhas fall to Mumbai Garuda after much promise | Sakshi
Sakshi News home page

ముంబై గరుడకు రెండో విజయం

Dec 15 2015 2:44 AM | Updated on Sep 3 2017 1:59 PM

ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ముంబై గరుడ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

లుధియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ముంబై గరుడ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు యోధాస్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై గరుడ 5-2 బౌట్‌ల తేడాతో గెలిచింది. బెంగళూరు యోధాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ రెజ్లర్లు నర్సింగ్ యాదవ్, బజరంగ్ తమ బౌట్‌లలో గెలిచినా... మిగతా రెజ్లర్లు ఓటమి పాలవ్వడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది.

పురుషుల 57 కేజీల బౌట్‌లో సందీప్ తోమర్ (బెంగళూరు) 0-5తో రాహుల్ అవారే చేతిలో... 125 కేజీల బౌట్‌లో దావిత్ (బెంగళూరు) 1-4తో లెవాన్ చేతిలో ఓడిపోగా... 61 కేజీల బౌట్‌లో బజరంగ్ (బెంగళూరు) 6-2తో అమిత్ ధన్‌కర్‌పై, 74 కేజీల బౌట్‌లో నర్సింగ్ యాదవ్ (బెంగళూరు) 6-0తో ప్రదీప్‌పై గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో రీతూ (ముంబై), 53 కేజీల విభాగంలో అడెకురోవ్ (ముంబై), 69 కేజీల విభాగంలో అడెలైన్ గ్రే (ముంబై) తమ ప్రత్యర్థులపై నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement