ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ యథావిధిగా

Australian Open Grand Slam Tennis Tournament Is To Be Held In Melbourne Park - Sakshi

కార్చిచ్చు పొగతో ఆలస్యమయ్యే సమస్యే లేదన్న నిర్వాహకులు

సిడ్నీ: ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరగనుంది. ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు మెల్‌బోర్న్‌ పార్క్‌కు ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో రగులుతోందని దీని వల్ల వేదికకు, ఆటగాళ్లకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగదని టెన్నిస్‌ ఆ్రస్టేలియా చీఫ్‌ క్రెయిగ్‌ టైలీ తెలిపారు. ఏటీపీ ప్లేయర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడైన నొవాక్‌ జొకోవిచ్‌ మీడియాతో మాట్లాడుతూ కార్చిచ్చు పొగవల్ల సమస్య ఉంటే మ్యాచ్‌ల్ని ఆలస్యంగా ప్రారంభించే అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన క్రెయిగ్‌ వాతావరణ శాఖ నిపుణులు గాలి నాణ్యతపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తున్నారని... వారితో నిర్వాహక కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top