పంత్‌ తలకు గాయం.. దాంతో

Australia Vs India 1st ODI Rishabh Pant On Concussion - Sakshi

ముంబై : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘరో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. అయితే, పరుగులు చేయడానికి భారత ఆటగాళ్లు ఆపసోపాలు పడిన పిచ్‌పైనే ఆసిస్‌ ఓపెనర్లు రెచ్చిపోయారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (112 బంతుల్లో 128 నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ (114 బంతుల్లో 110 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రిషభ్‌ పంత్ (33 బంతుల్లో 28; ఫోర్లు 2, సిక్స్‌ 1) గాయం బారిన పడ్డాడు.

కీపింగ్‌ చేయని పంత్‌
ముగ్గురు ఓపెనర్లు బరిలోకి దిగితే పంత్‌ను తుది జట్టులోంచి తప్పించవచ్చని, రాహుల్‌ కీపింగ్‌ చేస్తాడని మ్యాచ్‌కు ముందు వినిపించింది. అయితే పంత్‌ ఆడినా... చివరకు రాహులే కీపింగ్‌ చేయాల్సి వచి్చంది. బ్యాటింగ్‌లో పంత్‌ తలకు దెబ్బ తగలడమే అందుకు కారణం. కమిన్స్‌ బౌలింగ్‌లో పంత్‌ అవుటైన బంతి ముందుగా బ్యాట్‌కు తగిలి ఆ తర్వాత అతని తలకు బలంగా తాకి క్యాచ్‌గా మారింది. ఇన్నింగ్స్‌ అనంతరం పంత్‌ ‘కన్‌కషన్‌’కు గురైనట్లు, అతను కీపింగ్‌ చేయ లేడని బీసీసీఐ ప్రకటించింది. దాంతో రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. పంత్‌ గాయాన్ని ప్రస్తుతం ప్రత్యేక వైద్యులు పర్యవేక్షిస్తున్నారని బోర్డు ప్రకటించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top