హైదరాబాద్‌లో వన్డే,  వైజాగ్‌లో టి20

Australia  tour India for T20  ODI series in February March  - Sakshi

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ఖరారు

న్యూఢిల్లీ: వచ్చే నెలలో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఫిబ్రవరి 24నుంచి 13 మార్చి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 టి20 మ్యాచ్‌లు, 5 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను గురువారం అధికారికంగా ప్రకటించారు. వన్డే ప్రపంచ కప్‌కు ముందు ఈ పోరు జరుగుతుండటంతో ఇరు జట్లు కూడా తమ వరల్డ్‌ కప్‌ టీమ్‌ల ఎంపిక, సన్నాహకాల కోసం వన్డే సిరీస్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. షెడ్యూల్‌లో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖపట్నంలో రెండో టి20 మ్యాచ్‌... మార్చి 2న హైదరాబాద్‌లో తొలి వన్డే జరుగుతాయి.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top