ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఆటగాళ్ల మద్దతు | Anand Amritraj: Players lend support to Anand Amritraj, want him to continue | Sakshi
Sakshi News home page

ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఆటగాళ్ల మద్దతు

Dec 5 2016 12:22 AM | Updated on Sep 4 2017 9:54 PM

ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఆటగాళ్ల మద్దతు

ఆనంద్ అమృత్‌రాజ్‌కు ఆటగాళ్ల మద్దతు

క్రమశిక్షణా చర్యల కింద భారత డేవిస్ కప్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌పై అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వేటు వేయాలని భావిస్తోంది.

 కెప్టెన్, కోచ్‌లను కొనసాగించాలని ‘ఐటా’కు లేఖ  
 న్యూఢిల్లీ: క్రమశిక్షణా చర్యల కింద భారత డేవిస్ కప్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌పై అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వేటు వేయాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయంతో టెన్నిస్ ఆటగాళ్లు మాత్రం పూర్తిగా విభేదిస్తున్నారు. ఈ విషయంలో అమృత్‌రాజ్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ‘ఐటా’కు లేఖ రాశారు. జట్టు సహాయక సిబ్బందిలో ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించారు. అమృత్‌రాజ్‌తో పాటు కోచ్ జీషన్ అలీ ఒప్పందాలు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. 
 
 అరుుతే ఆనంద్ అమృత్‌రాజ్‌ను కొనసాగించేందుకు ‘ఐటా’ సుముఖంగా లేదు. ‘భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆనంద్‌ను కెప్టెన్‌గా, అలీని కోచ్‌గా ఉంచాలని మేము ‘ఐటా’ను కోరుతున్నాం. జట్టులో వారు మంచి వాతావరణాన్ని సృష్టించారు. మూడేళ్ల నుంచి జట్టు వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌కు చేరింది. అందుకే జట్టులో ఎలాంటి మార్పులు చేయవద్దు’ అని సోమ్‌దేవ్, యూకీ, సాకేత్, రామ్‌కుమార్ ‘ఐటా’కు విజ్ఞప్తి చేశారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement