ఆకాంక్ష, ప్రతినవ్‌లకు టైటిల్స్‌ | akanksha, pratinav won tsta titles | Sakshi
Sakshi News home page

ఆకాంక్ష, ప్రతినవ్‌లకు టైటిల్స్‌

Jan 1 2018 10:55 AM | Updated on Jan 1 2018 10:55 AM

akanksha, pratinav won tsta titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ఎం. ప్రతినవ్, ఆకాంక్ష విజేతలుగా నిలిచారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్‌ థామస్‌ హైస్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్‌–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన బాలుర సింగిల్స్‌ టైటిల్‌పోరులో టాప్‌సీడ్‌ ప్రతినవ్‌ 8–6తో వి. కౌషిక్‌ కుమార్‌ రెడ్డిపై విజయం సాధించాడు. బాలికల తుదిపోరులో ఆకాంక్ష 8–6తో రహీన్‌ తరన్నుమ్‌ను ఓడించింది.

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఆకాంక్ష 8–3తో అనికా కరంపూరిపై, రహీన్‌ 8–5తో రిషిక రావుపై, కౌషిక్‌ కుమార్‌ 8–1తో లలిత్‌ మోహన్‌పై, ప్రతినవ్‌ 8–0తో శ్రీహరిపై విజయం సాధించారు. అండర్‌–12 బాలబాలికల విభాగాల్లో రహీన్, శ్రీహరి చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో శ్రీహరి 8–5తో కోట శ్రీనాథ్‌పై, రహీన్‌ 8–3తో రిషిక రావుపై గెలుపొందారు. అండర్‌–10 బాలుర సింగిల్స్‌ టైటిల్‌పోరులో చైత్ర దర్శన్‌ రెడ్డి 8–0తో ఆకాశ్‌ సాగర్‌ను చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో మాస్టర్‌ సిరీస్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాలికల ఫైనల్లో థానియా 8–7 (5)తో రిషితా రెడ్డిపై గెలుపొంది విజేతగా నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement