అండర్-17 ప్రపంచకప్‌కు డైరెక్టర్ల నియామకం | AIFF select U-17 World Cup directors | Sakshi
Sakshi News home page

అండర్-17 ప్రపంచకప్‌కు డైరెక్టర్ల నియామకం

Sep 23 2014 7:58 PM | Updated on Jun 15 2018 4:33 PM

భారత్‌లో 2017లో జరుగనున్న ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌కు నిర్వాహక కమిటీ డైరెక్టర్లను నియమించింది.

న్యూఢిల్లీ: భారత్‌లో 2017లో జరుగనున్న ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌కు నిర్వాహక కమిటీ డైరెక్టర్లను నియమించింది. టోర్నమెంట్ డైరెక్టర్‌గా జేవియర్ సెప్పి, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా జాయ్ భట్టాచార్యను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. గత నెల్లో ఇంటర్వ్యూ ప్యానెల్ షార్ట్‌లిస్ట్ చేయగా.. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తుది నియామకాలకు ఆమోద ముద్ర వేశారు.

 

2017లో జరిగే అండర్-17 ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్‌గా ఎంపికైన జేవియర్ గత ఏడాది యూఏఈలో జరిగిన వరల్డ్‌కప్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. చైనాలో జరగనున్న 2015 అండర్-17 ప్రపంచకప్‌కూ ఆయన టోర్నీ డైక్టర్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement