డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

AB de Villiers Feels That Playing Away From Home Gives Pressure - Sakshi

క్రికెట్‌లో విధ్వసంకర ఆటగాళ్ల  జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌(34)కు ఎప్పుడూ చోటుంటుంది. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ ఉందనగా అనూహ్యంగా ఈ ఏడాది మే నెలలో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి సొంత జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు షాకిచ్చాడు ఏబీ. అయితే తన కెరీర్‌పైగానీ, లేక రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు తానేం చింతించడం లేదన్నాడు. తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను షేర్‌ చేసుకున్నాడు.

‘విదేశాల్లో ఆడటాన్ని ఒత్తిడిగా భావించడం లేదని ప్లేయర్లు తరచుగా చెబుతుంటారు. అయితే నెలల తరబడి విదేశాల్లో సిరీస్‌లు, టోర్నీలు ఆడుతుంటే క్రికెటర్లు మాత్రమే కాదు.. ఇతర క్రీడలు ఆడే ఆటగాళ్లు సైతం ఒత్తిడికి లోనవడం సర్వ సాధారణం. అయితే తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. స్వదేశంలో ఆడుతున్నట్లే భావిస్తానని ఏ ఆటగాడైనా చెబితే అతడు కచ్చితంగా అబద్ధం చెబుతున్నాడని అర్థం. అయితే ఒత్తిడిగా ఫీలవుతే ఆటగాళ్లు త్వరగా అలసిపోతారు.

కొన్నిసార్లు జట్టు ఎంపిక అనేది చిందరవందరగా ఉంటుంది. నేను దాదాపు రెండేళ్లపాటు (2016, 2017లో) టెస్ట్‌ ఫార్మాట్‌కు దూరమయ్యా. అందుకు గాయాలు కూడా ఓ కారణం. ఈ ఏడాది భారత్‌, ఆస్ట్రేలియాలతో టెస్ట్‌ సిరీస్‌లలో మెరుగ్గానే ఆడానని భావిస్తున్నా. దేశం, అభిమానులు, కోచ్‌లు ఆటగాళ్లపై ఎన్నో ఆశలు పెంచుకుంటారు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన మ్యాచ్‌లలో శాయశక్తులా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూశా. అయితే అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంపై ఎలాంటి బాధ లేదని’ ఏబీ డివిలియర్స్‌ వివరించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top