వైరలవుతోన్న వీడియో.. కరెక్ట్‌గా గెస్‌ చేయగలరా?

IFS Officer Susanta Nanda Tweet Moose Swimming Video - Sakshi

పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్‌లో‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంత నంద ఈ వీడియోను రెండు రోజుల క్రితం  తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్‌ చేశారు. అయితే వీడియోతో పాటు ఓ పజిల్‌ను కూడా ఇచ్చారు సుశాంత నంద‌. వీడియో చూసి రకరకాల సమాధానాలు చెప్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో  నీలాకుపచ్చ వర్ణం నీటిలో ఓ జీవి తన తలను ముంచి ఈదుతుంది. ఓ 20 సెకన్ల తర్వాత బయటకు వస్తుంది. అయితే మొదటి పది సెకన్లలోనో ఆ జీవి ఏంటో గుర్తించగలరా అంటూ సుశాంత నందా ఓ చాలెంజ్‌ విసిరారు. ఇప్పటికి 10 వేల మంది ఈ వీడియోను చూశారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే సరైన సమాధానం చెప్పగలిగారు. మీరు ఓ సారి ప్రయత్నించండి. గెస్‌ చేయలేకపోతే.. సమాధానం కోసం వీడియో పూర్తిగా చూడండి.

ఇక్కడ నీటిలో ఈదుతున్న జీవి పేరు మూస్‌. దుప్పి జాతికి చెందిన ఈ జంతువు రష్యా, అమెరికా, కెనడాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏడేళ్ల క్రితం వేన్‌ ఎల్లెట్‌ అనే వ్యక్తి అమెరికా, మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలో ఈ వీడియోను తీశాడు. సుశాంత నంద మళ్లీ రీ పోస్ట్‌ చేయడంతో మరోసారి వైరల్‌ అవుతోంది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top