దానిమ్మను ఇలా ఒలిచేయండి.. ఈజీగా

How to slice a pomegranate in a proper way  - Sakshi

దానిమ్మ కాయ గురించి తెలియని వారు  వుండరు. అనేక  ఔషధ లక్షణాలను తనలోదాచుకున్న దానిమ్మ  అంటే ఇష‍్టం పడనివారు దాదాపు ఎవరూ వుండరు.  ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ జ్యూస్‌ను సేవిస్తే..రక్తహీనత నుంచి  బయటపడవచ్చని వైద్యులు చెపుతారు. అలాగే దానిమ్మ పండు పైన ఉన్న బెరడును పదిగ్రాములు తీసుకుని దాన్ని కషాయంగా కాచి తాగితే విరోచనాల నుంచి విముక్తి కలుగుతుందట. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా దానిమ్మ గింజలను తింటే క్యాన్సర్ బారి నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.

అయితే.. దానిమ్మ కాయలు వలవడం అంటే అంత సులువు కాదు.  కొంచెం  కష్టపడాల్సిందే. దానిమ్మ గింజలు చితికిపోకుండా, దుస్తుల మీద గింజల రసం పడకుండా.. జాగ్రత్తగా ఒలవాలి. ఎందుకంటే.. దానిమ్మ రసం దుస్తుల మీద పడితే... ఆ మరకలు ఒక పట్టాన పోవు. దీంతో దానిమ్మ గింజలు ఒలవడం అంటే  ఓర్పు, నేర్పూ  వుండాలి. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ  తాజాగా దానిమ్మగింజలు ఒలిచే విధానంపై ఒక వీడియో  ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  మరి  సులభమైన ఆ విధానం కథా కమామిషు ఏంటో  మీరు కూడా  ఒకసారి వీక్షించండి..  ఇప్పటికే చూశారా.. అయినా మరోసారి చూసేయండి!

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top