ఉల్లిపొట్టు కూడా తీయలేవ్‌.. పవన్‌ కల్యాణ్‌!

YSRCP MP Vijaya Sai Reddy Satires On Pawan Kalyan - Sakshi

నీ బాస్‌ చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నారు

ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్‌ ఒక అమ్ముడుపోయిన వ్యక్తని, అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. పవన్‌ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడని, ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లమని సూచించారు. బుధవారం ట్విటర్‌ వేదికగా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబు, పవన్‌లపై ధ్వజమెత్తారు.

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం అని కోతలు కోస్తాడు. పోలింగ్‌ ఇక పది రోజుల్లోనే. ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే దమ్ము లేదు. కిందటి ఎన్నికల మేనిఫెస్టోని తన పార్టీ వెబ్సైట్లో కనిపించకుండా తీసేశారు. నిజాయితీ అన్న మాటకు వ్యతిరేకార్థం ఏదైనా ఉంటే అది చంద్రబాబే!’ అని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నాయకుల ప్రచారం ముగిసిందని, తన సభలకేమో జనాలు రావడం లేదని, దర్శకుడు రాఘవేంద్రరావు ద్వారా సినీ హీరోలు, కథానాయికలను రప్పించడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గెలిచే సీన్ లేదని తెలిసి జూనియర్ ఆర్టిస్టులు కూడా తప్పించుకు తిరుగుతున్నారని వ్యంగ్యాస్తాలు సంధించారు. కిందటిసారి కుప్పంలో 50 వేల దొంగ ఓట్లు చేర్పించి, 20 వేల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లు తొలగించి, చంద్రబాబు 47 వేల మెజారిటీ తెచ్చుకున్నారని, ఈసారి లక్షా 20 వేల ఆధిక్యత రావాలనే స్కెచ్ వేశారన్నారు. ఈ టార్గెట్‌ కోసం ఓటుకు లక్ష పంపిణీ చేస్తున్నట్టు అనిపిస్తోందని, చంద్రబాబు బతుకంతా అక్రమాలేనని ధ్వజమెత్తారు.

కులగజ్జి మీడియాను ఎలా ఓదార్చాలో..
‘ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది. జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్, పావలా, పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి. కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు.’ అని సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top