అమరావతి కోసం అంటూ తప్పుడు ప్రచారం.. | YSRCP MP Nandigam Suresh Lashes Out At Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి: ఎంపీ నందిగం సురేష్‌

Jan 8 2020 6:25 PM | Updated on Jan 8 2020 6:43 PM

YSRCP MP Nandigam Suresh Lashes Out At Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై దాడి హేయనీయమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాజధాని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారు. అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలో ముఖ్యమంత్రికి తెలుసు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు. 
ప్రతి రైతును సీఎం జగన్‌ ఆదుకుంటారు.

రాజధానిని నాశనం చేసింది బాబే...
తాను దోచుకున్న డబ్బు బైటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. తన ఆస్తుల కోసం ప్రతిపక్ష నేత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. లక్ష కోట్లు ఒకేచోట పెడితే..మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి. ఆయన ఫ్యాక్షనిస్ట్‌లా వ్యవహరిస్తూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయిస్తున్నారు. కర్నూలు, విశాఖలో రెండు రాజధానులు పెడితే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? జరిగిన దాడులు అల్లర్లలో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి. జస్టిస్‌ శివరామకృష్ణన్ నివేదిక పట్టించుకోకుండా రాజధానిని నాశనం చేసింది చంద్రబాబే. 

ఆయన రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుడిగా దిగజారిపోయారు. రాజధాని ఉద్యమంలో టీడీపీ గూండాలు, రౌడీలు పాల్గొని అల్లర్లు సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఈ అయిదేళ్లలో అమరావతిలో ఎందుకు ఒక్క శాశ్వత భవనాన్ని కూడా కట్టలేకపోయారు. రాజధానిలో ఎవరు చనిపోయినా అమరావతి కోసం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రజా ప్రతినిధులపై దాడులు చేయించిన చంద్రబాబును అరెస్ట్‌ చేసి విచారణ జరపాలి’  అని డిమాండ్‌ చేశారు.

చదవండి:

ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాయత్నం

దాడి చేసింది రైతులు కాదు..చంద్రబాబు గూండాలే..

వినాశకాలం.. అందుకే విపరీత బుద్ధి

పక్కా పథకం ప్రకారమే పిన్నెల్లిపై హత్యాయత్నం

'చంద్రబాబు చరిత్ర హీనులవడం ఖాయం'

Advertisement
 
Advertisement
Advertisement