అజెండా దాచిపెట్టి... ఆమోదింపజేశారు..! | YSRCP Councilors Critics On Machilipatnam Council Meeting | Sakshi
Sakshi News home page

అజెండా దాచిపెట్టి... ఆమోదింపజేశారు..!

Feb 21 2019 5:20 PM | Updated on Feb 21 2019 5:27 PM

YSRCP Councilors Critics On Machilipatnam Council Meeting - Sakshi

అజెండాలోని అంశాలను ముందుగా తెలియనివ్వడంలేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, కృష్ణా : మచిలీపట్నం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లకు అజెండా అందించడంలో అధికార టీడీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అజెండాలోని అంశాలను ముందుగా తెలియనివ్వడంలేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా ఇవ్వకుండా చివరివరకు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిసల్‌ చైర్మన్‌ బాబా ప్రసాద్‌ అజెండాలోని అంశాలపై ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement