కర్ణాటకలో బీజేపీ నేతల అత్యవసర భేటీ

We will win Floor Test, Sadananda Gowda - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలతో నేతలు హడావుడిగా ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలు నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఉదయం అత్యవసరంగా సమావేశం అయ్యారు.  సీఎం యడ్యూరప్ప, ప్రకాశ్‌ జవదేకర్‌, అనంత్‌ కుమార్‌, సదానంద గౌడ ఈ సమావేశంలో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంతో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇవాళ పది గంటలకు అసెంబ్లీలో బీజేఎల్పీ సమావేశం కానుంది.

కాగా బలపరీక్షపై బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ....‘సాయంత్రం 4.30 వరకూ వేచి చూడండి. బలపరీక్షలో యడ్యూరప్ప నెగ్గుతారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు.’ అని ధీమా వ్యక్తం చేశారు.

  • హిల్టన్‌ హోటల్‌లో 76మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • లీ మెరిడియన్‌ హోటల్‌లో 36మంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలు
  • శాంగ్రిల్లా రిసార్ట్స్‌ లో బీజేపీ ఎమ్మెల్యేలు
  • ఎమ్మెల్యేలతో ఆయా పార్టీల కీలక నేతల సమావేశం
  • సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలపై చర్చ
  • మరి కాసేపట్లో అసెంబ్లీకి బయలుదేరనున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top