రాజకీయాల్లో కొనసాగుతా : ఊర్మిళ

Urmila Matondkar Said That She Wont Quit Politics - Sakshi

తన గ్లామర్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను ఊపేసిన ఊర్మిళ మతోండ‍్కర్‌ ఈ జనరల్‌ ఎలక్షన్స్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే తొలి ప్రయత్నం ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఉత్తర ముంబై నుంచి పోటి చేసిన ఆమె సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపాల్‌ చినయ్య శెట్టి కన్నా నాలుగున్న లక్షల ఓట్ల వెనకపడ్డారు. దీంతో ఓటమిని అంగీకరించిన ఊర్మిళ.. ‘ఇది తొలి అడుగు మాత్రమే ఓడిపోయినా రాజకీయాల్లో కొనసాగుతా’ అన్నారు.

సినీ రంగ ప్రముఖులు ఎక్కువగా బీజేపీకి జై కొడుతుంటే ఊర్మిళ మాత్రం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ఊర్మిళ ముంబై నార్త్‌ నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు. తొలి ప్రయత్నంలో బలమైన బీజేపీ నేత గోపాల్ చినయ్య శెట్టితో ఆమె తలపడ్డారు. గత ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధించిన ఆయన ఈ సారి కూడా అదే స్థాయిలో ఘనవిజయాన్ని అందుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top