కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు | Two Congress MLAs Jump To TRS | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

Mar 2 2019 9:42 PM | Updated on Mar 18 2019 7:55 PM

Two Congress MLAs Jump To TRS - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుద్దామనుకున్న కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ..

సాక్షి, హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రేపు ఉదయం టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలోనే ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. పోడు, గిరిజన భూములకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల కోసం సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారని.. కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని రేగా కాంతారావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుద్దామనుకున్న కాంగ్రెస్‌కు.. ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాతో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement