‘ప్రభుత్వం నుంచి బయటకు వస్తాం.. అధికారంలోకి వస్తాం’

Shiv Sena will walk out of Maharashtra govt within one year - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఏడాదిలోపు బయటకు వెళ్లిపోతామని శివసేన గురువారం బీజేపీని తీవ్రహంగా హెచ్చరించింది. మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ - శివసేన సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొంతకాలం‍గా బీజేపీ-శివసేన మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.

గురువారం యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే (ఉద్దవ్‌ థాకరే కుమారుడు) అహ్మద్‌ నగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి నిజంగా అంత శక్తి ఉంటే.. ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి సొంతంగా అధికారంలో రావాలని చెప్పారు. బీజేపీ ఎంత గట్టిగా ప్రయత్నించిన శివసేన మాత్రం.. ఏడాదిలోపు ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకుంటుందని అన్నారు. అంతుకాక తరువాత జరిగే ఎన్నికల్లు శివసేన సొంతంగా అధికారంలోకి వస్తుందని చెప్పారు.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర శాసనసభకు 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మద్దతు ఉపసంహరించుకుంటామని కొంతకాలంగా శివసేన బీజేపీకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో శివసేనతో కలిసే బీజేపీ రాష్ట్రప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆదిత్య థాకరే వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన పనిలేదని మహారాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top