‘ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పు.. 23 వరకు ఎదురు చూస్తాం’

Shashi Tharoor Says Exit Polls Will Be Wrong - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిన్న వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలన్ని తప్పని, తాను వాటిని విశ్వసించబోనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. మే 23న వచ్చే ఫలితాలు.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని జరిగిన విధంగా ఇండియాలో కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పుతాయన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు.

‘ ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నమ్మడం లేదు. ఆస్ట్రేలియాలో గతవారం 56 ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలామంది ప్రజలు తామెవరికి ఓటేశామో బహిరంగంగా చెప్పరు. అసలు ఫలితాల కోసం మే 23 వరకూఎదురుచూస్తాం’ అని శశిథరూర్‌ పేర్కొన్నారు.
(చదవండి :  బీజేపీకే ప్రజామోదం)

 కాగా, నిన్న(ఆదివారం) సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top