
సాక్షి, హైదరాబాద్: దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ప్రశ్నించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు బుధవారం సెంట్రల్‌కోర్టు హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్, అధికార ప్రతినిధి సమ్మిరెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు.