‘చంద్రబాబు.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి’

Ramachandrapuram MLA Venugopal Says Chandrababu Playing Caste Politics - Sakshi

ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కృష్ణ

సాక్షి, రామచంద్రాపురం : జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. వంద రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి ఏమి చేయలేదనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. వంద రోజుల్లో వైఎస్‌ జగన్‌ 119 విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని.. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలను మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వహించిన అవినీతి పాలనకు రివర్స్‌లో జగన్‌ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వంద రోజుల పాలనలో జగన్‌ చేసిందేమి లేదన్న వ్యాఖ్యలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top