‘రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడర్‌’

Rahul Gandhi Is Parttime Leader Says Devendra Fadnavis - Sakshi

భోపాల్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడర్‌ అని, ఆయనకు ప్రజల సమస్యల పట్ల కనీస అవగహన కూడా లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌  ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. కేవలం​ రాజకీయ లబ్ది కోసమే రాహుల్‌ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారని, ఆయన స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సమయం గడుపుతారని వ్యాఖ్యానించారు. స్వదేశానికి వచ్చినప్పుడల్లా రెండు, మూడు సభలు నిర్వహించిన పోతారని అన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి ప్రాంతాల సమస్యలు రాహుల్‌కు తెలియవని, ఎన్నికల సమయంలోనే ఆయన ఈ ప్రాంతాలకు వస్తుంటారని విమర్శించారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లు ప్రజా నేతలని అన్నారు. అధికారం కోసమే అమలుకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిందని, చౌహాన్‌కు ప్రజల మద్దతు ఉన్నందును గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గరీభీ హఠావో నినాదం ఒక బూటకమని మండిపడ్డారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పేదరికాన్ని మరింత పెంచిందని విమర్శించారు.

కాగా మధ్యప్రదేశ్‌లో తొలి విడత ఎన్నికల ఈనెల 28న జరుగునున్న విషయం తెలిసిందే. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో బీజేపీ జాతీయ నేతలతో సహా, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుకు మధ్యప్రదేశ్‌ వేదికగా నిలిచింది. నేతల మాటల తూటలతో రాజకీయం మరింత వేడుక్కుతోంది. కాగా గత మూడు విడుతలుగా బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంటుండగా.. ఈ సారి విజయం కోసం హస్తం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top