కేంద్రం తీరుపై ప్రవీణ్‌ తొగాడియా విమర్శలు

Pravin Togadia Slams Central Governmment Regarding CAA Act  - Sakshi

ముంబై: ​కేంద్ర సర్కారుపై విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ    ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య ఢిల్లీలో అమాయక హిందువులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తొగాడియా డిమాండ్ చేశారు. షహీన్‌బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అదుపు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని  పేర్కొన్నారు. మన దేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులందరికీ పౌరసత్వ సవరణ చట్టం కింద భారతీయ పౌరసత్వం ఇచ్చి తీరుతామని.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top