జ్ఞాపకాలు పదిలం

Praja Prasthanam Completes 15 Years - Sakshi

వైఎస్సార్‌ పాదయాత్రకు నేటితో 15ఏళ్లు పూర్తి

2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి ‘ప్రజాప్రస్థానం’ ప్రారంభం

రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం ఇక్కడినుంచే  

చేవెళ్ల సెంటిమెంట్‌గా కాంగ్రెస్‌ నేటికీ కొనసాగింపు   

గత ఫిబ్రవరి 26న బస్సుయాత్ర ఆరంభం

చేవెళ్ల: దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి చేపట్టిన  ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వర్గీయ రాజశేఖరరెడ్డి పాదయాత్ర అనంతరం కాం గ్రెస్‌ పార్టీ 10ఏళ్లు అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. 2003 ఏప్రిల్‌ 9వ తేదీన చేవెళ్ల మండలకేంద్రంలోని మార్కెట్‌ యార్డు నుంచి   ప్రతిపక్షనేత హో దాలో ఆయన చేపట్టిన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి విశేష ఆదరణ లభించింది. పాదయత్రతో వైఎస్సార్‌ పల్లె ప్రజల కష్టాలను, కన్నీటిని దగ్గర నుం చి చూసి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అండ గా ఉండి కష్టాలు తీర్చి.. కన్నీళ్లను తూడుస్తానని హా మీ ఇచ్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఆ యన పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిఫలాలు ప్రతిఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకున్నా రు.

అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ రైతులను పూ ర్తిగా విస్మరించి వారికి అన్యాయం చేసింది. ఈనేపథ్యంలో రైతులకు అండగా నిలిచారు. మొట్టమొదటి సారిగా ఉచిత విద్యుత్‌ అమలుపై సంతకం చేసి రైతు బాంధవుడిగా పేరుతెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాదయాత్రలో ఇ చ్చిన హామీలన్నీ నెరవేర్చారు. పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన ఆయన  చేవెళ్లను తన సెంటిమెం ట్‌గా ప్రకటించారు. పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. చేవెళ్ల సెంటిమెంట్‌ రుణం తీర్చుకునేందుకు ఈ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా మేలు చేకూర్చేవిధంగా చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టుకు నవంబర్‌ 19, 2008లో  శంకుస్థాపన చేశారు. నేటికి వైస్సార్‌ చేపట్టిన పాదయాత్ర 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇక్కడి ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ఆయన స్మృతులను  ప్రజలు తమ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. వైఎస్సార్‌ పాదయాత్రకు విశేషమైన స్పందన రావడంతో ఇప్పటికీ కాంగ్రెస్‌పార్టీ నాటి రాజశేఖరరెడ్డి సెంటిమెంట్‌ను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 26న చేవెళ్లనుంచి  కాంగ్రెస్‌ పార్టీ ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top