
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఆ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(కేఈఆర్‌సీ) సోమవారం సవరించిన విద్యుత్ టారిఫ్‌లను ప్రకటించింది. ఈ ధరలు 2018, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయంది. బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ(బెస్కామ్) టారిఫ్‌ను 5.93% అంటే సగటున ఒక్కో యూనిట్‌కు 25 పైసలు పెంచినట్లు కేఈఆర్‌సీ తెలిపింది. అలాగే మిగిలిన ఐదు విద్యుత్ సరఫరా సంస్థల టారిఫ్‌లను సగటున ఆరు శాతం అంటే ఒక్కో యూనిట్‌కు 20 నుంచి 60 పైసల మేర పెంచామంది. బెంగళూరు మెట్రోకు వసూ లు చేస్తున్న విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.6 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది.