మోదీకి సిద్ధూ సవాల్‌ | Now Siddaramaiah Challenges PM Narendra Modi  | Sakshi
Sakshi News home page

మోదీకి సిద్ధూ సవాల్‌

May 2 2018 6:21 PM | Updated on May 2 2018 7:24 PM

Now Siddaramaiah Challenges PM Narendra Modi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు పతాక స్థాయికి చేరాయి. కర్ణాటకలో పాలక కాంగ్రెస్‌ సాధించిన విజయాలపై 15 నిమిషాల పాటు పేపర్‌ చూడకుండా మాట్లాడాలని ప్రధాని మోదీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి సవాల్‌ విసరగా తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు. గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం గురించి 15 నిమిషాలు ప్రసంగించాలని మోదీకి సిద్ధరామయ్య సవాల్‌ విసిరారు. తమ పార్టీ చీఫ్‌కు ప్రధాని మోదీ విసిరిన సవాల్‌పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు.

విపక్షాలు లేవనెత్తిన అంశాలపై బదులిచ్చేందుకు ప్రధాని వద్ద ఎలాంటి సమాధానాలు లేవని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోందని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. వాస్తవాలను వక్రీకరించకుండా ప్రధాని కేవలం 15 సెకన్లు మాట్లాడాలని డిమాండ్‌ చేసింది. నీరవ్‌ మోదీ, జై షా, రాఫెల్‌ డీల్‌, పీయూష్‌ గోయల్‌ అవినీతి ఇలా ఏ అంశంపైనా ప్రధాని వద్ద సమాధానాలు లేవని కాంగ్రెస్‌ ప్రతినిధి సుస్మితా దేవ్‌ అన్నారు. మరోవైపు ప్రధాని మోదీ సవాల్‌ను స్వీకరించాలని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్ధుల్లా రాహుల్‌కు సూచించారు. అప్పుడు లైంగిక దాడులపై నోరు మెదపాలని తాము  ప్రధానిని కోరతామని ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement