ముగిసిన నామినేషన్ల ఘట్టం

Nominations Files Time End In AP And Telangana - Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలకు కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ అభ్యర్థులతో కిటకిటలాడాయి. ఆకరి రోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రేపు, ఎల్లుండి నామినేషన్‌ పత్రాలను  పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 28 వరకు  గడువు ఉంది. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

మరోవైపు రెబల్‌ అభ్యర్థులను విత్‌డ్రా చేయించేందుకు పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కీలకమైన నామినేషన్ల ‍ప్రక్రియ ముగియడంతో నేతలు ప్రచారంలో మునిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ , 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.  ఏప్రిల్‌ 11న దేశ వ్యాప్తంగా తొలివిడత ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top