మోదీ, గాడ్సేలది ఒకే భావజాలం: రాహుల్‌

Nathuram Godse, Narendra Modi believe in same ideology - Sakshi

వయనాడ్‌: ప్రధాని మోదీ, జాతిపిత మహాత్మ గాంధీని కాల్చి చంపిన నాథూరామ్‌ గాడ్సేది ఒకే రకమైన భావజాలమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమంలో భాగంగా బుధవారం కేరళలోని కాల్‌పెట్టాలో రాహుల్‌ గాంధీ వేలాది మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ.. తరహా భావజాలం కలిగిన వాడేనని, కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకునే ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో యువతకు భవిష్యత్తు లేదని, పాకిస్థాన్‌ గురించి ప్రధాని ఎంత మాట్లాడినా మన యువకులకు ఉద్యోగాలైతే రావని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top