మంగళగిరిలో లోకేశ్‌కు ఎదురుగాలి

Nara Lokesh Elections Campaign In Mangalagiri - Sakshi

మంగళగిరిలో సీఎం తనయుడికి గడ్డుస్థితి

ప్రచారంలో కానరాని స్పందన.. డబ్బులిచ్చి జనాన్ని తరలించాల్సిన దుస్థితి

చివరి వరకు సీటు తమకిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్న భావనలో బీసీలు

ఇప్పటికే లోకేశ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు

మరోవైపు 2024లో మంగళగిరి టికెట్‌ను బీసీలకు ఇప్పిస్తామన్న ఆర్కే

తమ పార్టీ అధినేతను ఒప్పిస్తానని హామీ

దీంతో ప్రస్తుత ఎన్నికల్లో ఆర్కేకు మద్దతు తెలపాలని బీసీ సంఘాల నిర్ణయం

డబ్బుల కట్టలతో గెలవాలన్న పన్నాగంలో అధికార పార్టీ

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం.. బలమైన ప్రత్యర్థి బరిలో ఉండడంతో ఈ ఎన్నికల్లో లోకేశ్‌ గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి. దీనికితోడు ప్రచారంలో తానుగా చేస్తున్న కామెడీతో లోకేశ్‌ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే ఓటింగ్, కౌంటింగ్‌ ప్రక్రియలపై నోరు జారడంతో సామాజిక మాధ్యమాలలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. అదే సమయంలో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది.

వైఎస్సార్‌సీపీ వైపే బీసీల మొగ్గు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు మంగళగిరిలో స్థానికంగా బలంగా ఉన్న బీసీలు తమకు టికెట్‌ కేటాయిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకత్వం చివరకు మొండిచేయి చూపి అధినేత తనయుడికి సీటివ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం శుక్రవారం మంగళగిరిలో సమావేశమై తమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఇదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ 2024లో మంగళగిరి స్థానాన్ని బీసీలకే కేటాయిస్తామని, ఈ మేరకు తమ పార్టీ అధినేతను తాను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న బీసీ సంఘాల నేతలంతా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపడంతోపాటు ఆర్కేకు ఓటు వేసి గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు.

లోకేశ్‌కు ఝలక్‌ తప్పదంటున్న బీసీలు 
ఇదిలా ఉంటే.. నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తరచూ కుప్పం గురించి ప్రస్తావిస్తూ, తన తండ్రిని నాలుగు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆదరించి, విజయాన్ని అందిస్తున్నారని, తాను గెలిస్తే మంగళగిరిని కుప్పంలా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఈ మాట బీసీలంతా పునరాలోచనలో పడేలా చేసింది. ఈ ఎన్నికల్లో లోకేశ్‌ గెలుపునకు సహకరిస్తే ఆయన ఇక్కడే పాతుకుపోతారని, భవిష్యత్తులో తమకు అవకాశమే లేకుండా పోతుందన్న భావనకు వారు వచ్చారు.

ఇప్పటికే మంగళగిరి టికెట్‌ను బీసీలకే కేటాయిస్తామని చివరిదాకా చెప్పిన అధిష్టానం.. ఆఖరు నిమిషంలో లోకేశ్‌ను బరిలోకి దింపడం ద్వారా తమను నమ్మించి మోసం చేసిందని, ఈ పరిస్థితుల్లో లోకేశ్‌ గెలవకుండా చేసి తమ తడాఖా చూపాలని వారు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా ఓటర్లు ఉండగా.. ఇందులో బీసీలు 70 వేల వరకు ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలచి లోకేశ్‌కు మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమవుతున్నారు.

డబ్బుల కట్టలతో గెలవాలని ప్రయత్నం..
నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారు. ఏదేమైనా లోకేశ్‌ను గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు వెనుకాడట్లేదు.

ఇందులో భాగంగా భారీ ఎత్తున డబ్బులు దింపేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం తనయుడు కావడంతో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. శుక్రవారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకోసం ఒక్కో ఓటుకు రూ.4 వేల చొప్పున డబ్బులు పంచడం ఇందుకు నిదర్శనం. అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కే ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఆయన్ను నిలువరించేందుకు నానా తంటాలు పడుతున్న టీడీపీ నేతలు భారీ మొత్తంలో డబ్బు దించయినా గెలవాలని గట్టి పన్నాగంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు

18-05-2019
May 18, 2019, 09:17 IST
న్యూఢిల్లీ : ‘భారత విభజన సారథి’ అనే శీర్షికన కొద్ది రోజుల క్రితం టైమ్ మ్యాగజైన్‌ ప్రధాని నరేంద్ర మోదీపై...
18-05-2019
May 18, 2019, 08:28 IST
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో ఫారం–17సి పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్,...
18-05-2019
May 18, 2019, 08:14 IST
సాక్షి, కడప:  జమ్మలమడుగు నియోజవర్గం టీడీపీకి 1983 నుంచి 2004 వరకు కంచుకోటగా నిలిచింది. వరుసగా ఐదు పర్యాయాలు పొన్నపురెడ్డి కుటుంబీకులకు  మద్దతుగా...
18-05-2019
May 18, 2019, 07:35 IST
చుంచుపల్లి: జిల్లాలో పరిషత్‌ పోరు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా...
18-05-2019
May 18, 2019, 05:48 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా తక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్‌ ఒక్కటే. శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు ఉన్న బీజేపీ ఈ...
18-05-2019
May 18, 2019, 05:17 IST
సరిహద్దుల్లో దేశభద్రతకోసం సాహసోపేతంగా పోరాడిన సినీ హీరో ఇప్పుడు రాజకీయ బరిలో నిజమైన సమరాన్ని ఎదుర్కోబోతున్నారు. ‘బోర్డర్‌’, ‘గదర్‌ –ఏక్‌...
18-05-2019
May 18, 2019, 05:01 IST
మధ్యప్రదేశ్‌ చివరి దశ కీలకం లోక్‌సభ ఎన్నికల చివరి దశలో మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. దళితులు, ఆదివాసీల జనాభా...
18-05-2019
May 18, 2019, 04:44 IST
కాంగ్రెస్‌ పార్టీకి వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. దేశ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించిన ఈ పార్టీ, స్వాతంత్య్రానంతరం దాదాపు నాలుగు దశాబ్దాల...
18-05-2019
May 18, 2019, 04:16 IST
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు...
18-05-2019
May 18, 2019, 04:02 IST
మిర్జాపూర్‌/గోరఖ్‌పూర్‌(యూపీ): నరేంద్ర మోదీ ఒక నటుడని, ప్రధాని పదవికి అమితాబ్‌ బచ్చన్‌ సరైన వ్యక్తి అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి...
18-05-2019
May 18, 2019, 03:56 IST
సాక్షి, బెంగళూరు: రాహుల్‌ మూర్ఖుడు అంటూ కేంద్ర సహాయ మంత్రి, కర్ణాటకకు చెందిన అనంతకుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్య కొత్త...
18-05-2019
May 18, 2019, 03:42 IST
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. 38 రోజుల పాటు ఏకధాటిగా సాగిన...
18-05-2019
May 18, 2019, 03:30 IST
న్యూఢిల్లీ/సిమ్లా:  లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద పార్టీలు గరిష్టస్థాయిలో సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో...
18-05-2019
May 18, 2019, 03:18 IST
న్యూఢిల్లీ/ఖర్గోన్‌(మధ్యప్రదేశ్‌): బీజేపీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు....
18-05-2019
May 18, 2019, 00:38 IST
ఏడు దశల సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆదివారం 59 స్థానాలకు జరగబోయే చివరి దశ పోలిం గ్‌కు ప్రచార ఘట్టం...
17-05-2019
May 17, 2019, 20:56 IST
సాక్షి, అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో దళితుల్ని ఓటు వేయకుండా చేసి వారి ఓట్లు తెలుగుదేశం పార్టీ నేతలే వేయడం అప్రజాస్వామికమా?...
17-05-2019
May 17, 2019, 20:03 IST
లోక్‌సభ తుది విడత ఎన్నికల ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.
17-05-2019
May 17, 2019, 19:59 IST
పచ్చతమ్ముళ్ల బాగోతం బయటపడడంతో షాకైనా బాబు.. అక్కడ నుంచి సైలెంట్‌గా వెనక్కొచ్చేశారు.
17-05-2019
May 17, 2019, 19:09 IST
ఒకవేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓడిపోతే! అంటే బీజేపీ పార్టీకి అధికారం సిద్ధించకపోతే!
17-05-2019
May 17, 2019, 19:04 IST
మోదీ నేత కాదు..నటుడే..
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top