సీఎం కేసీఆర్‌తోనే నా సవాల్‌: నాగం | nagam janardhan reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

Feb 4 2018 3:48 PM | Updated on Aug 15 2018 9:04 PM

nagam janardhan reddy slams cm kcr - Sakshi

నాగం జనార్దన్‌రెడ్డి,కేసీఆర్‌

సాక్షి, నాగర్‌కర్నూలు: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఏ ప్రాజెక్టును తాను అడ్డుకోవడం లేదని, కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైనే పోరాడుతున్నానని సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే నా సవాల్‌ అని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి వదలబోనని నాగం అన్నారు. కేసీఆర్‌ వస్తానంటే తాను ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమన్నారు. ‘ఆధారాలతో సహ వస్తా.. నా ప్రశ్నలకు సమాధానం చెప్తారా’ అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సెటిల్మెంట్లపై పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.

మార్కెట్ యార్డు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం,  రోడ్డు కోసం దానం చేయడానికి ఎమ్మెల్యే మర్రి ఎవరు అని ఆయన ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ పత్రికకు చందదారులను పెంచేందుకు ఎమ్మెల్యే మర్రి మార్కెట్ యార్డు నుంచి లక్ష రూపాయల మేర చందదారులను నమోదు చేయించాడని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement