చంద్రబాబు పర్యటన.. అనేక సందేహాలు.. | Many Doubts On Chandrababu Delhi Tour Says Peddireddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పర్యటన.. అనేక సందేహాలు..

Apr 3 2018 10:36 AM | Updated on Jul 28 2018 3:41 PM

Many Doubts On Chandrababu Delhi Tour Says Peddireddy - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అనేక సందేహాలు ఉన్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అవినీతి, మంత్రి లోకేష్‌పై మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో బాబు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీలో రాజకీయంగా లాబియింగ్‌ చేస్తున్నారని చెప్పారు.

మరో మూడు రోజుల్లో పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడుతుంటే, చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకు ప్రత్యేక హోదా కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేశారని అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చివరి వరకూ అవిశ్వాసంపై పట్టుబడతామని లేకపోతే రాజీనామా చేసి వెంటనే ఆమరణ దీక్షకు దిగుతామని చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు.  

చంద్రబాబు ఎందుకోసం ఇప్పటివరకూ ఎంపీల కార్యచరణను ప్రకటించలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో బాబు దేనికోసం రాజకీయ పక్షాలతో లాబీయింగ్‌ చేస్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement