కులాల మధ్య బాబు చిచ్చు: మానుగుంట | Manugunta Mahidhar Reddy Slams Chandrababu In Kandukur | Sakshi
Sakshi News home page

కులాల మధ్య బాబు చిచ్చు: మానుగుంట

Jul 31 2018 2:30 PM | Updated on Aug 29 2018 3:33 PM

Manugunta Mahidhar Reddy Slams Chandrababu In Kandukur - Sakshi

అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా నేటికీ మోసపూరిత తీర్మానాలు చేస్తూ కాపులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

కందుకూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత మానుగుంట మహిధర్‌ రెడ్డి మండిపడ్డారు. కందుకూరులో మహిధర్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాబు తన అనుకూల పత్రికల ద్వారా కుహానా రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా నేటికీ మోసపూరిత తీర్మానాలు చేస్తూ కాపులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని కొనియాడారు. జగ్గంపేట సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి కాపులను జగన్‌కు దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 వేల కోట్లు కాపు కార్పొరేషన్‌కు ఇస్తామని చెప్పి నాలుగున్నర ఏళ్లలో రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చి మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాపులకు రూ.10 వేల కోట్లు ప్రకటించడం హర్షణీయం అన్నారు. చంద్రబాబు మాయమాటలు కాపు సోదరులు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement