జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం.. | Local Protest Against JC Prabhakar Reddy In Tadipatri Mandal | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం..

Aug 2 2019 1:12 PM | Updated on Aug 2 2019 1:23 PM

Local Protest Against JC Prabhakar Reddy In Tadipatri Mandal - Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్‌ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన ఆయన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో తమకు జరిగిన అన్యాయంపై స్థానికులు ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని స్థానికులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రెడ్డిని అడ్డుకున్న స్థానికులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement