ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

Live Updates on Election 2019 Exit Poll Results - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడువిడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

 • ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలోనూ వైఎస్సార్‌సీపీకి విస్పష్టమైన మెజారిటీ లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 44శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 111 నుంచి 121 సీట్లు సాధిస్తుందని, అధికార టీడీపీ 39.10 ఓట్లతో 54 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 10. 6 శాతం ఓట్లతో జనసేన సున్నా నుంచి నాలుగు స్థానాలకు పరిమితం అవుతుందని ఈ సర్వే స్పష్టంచేసింది.

ఉత్తరాదిలో తిరుగులేని మోదీ

 • వివిధ సర్వే సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్‌లో మరోసారి దీదీ కొనసాగనుందని స్పష్టమైంది. ఇక, ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్రమోదీ ఛరిష్మాకు తిరుగులేదని స్పష్టమైంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే వివిధ మీడియా సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన సర్వే ఫలితాలివి..
 • టైమ్స్‌ నౌ- వీఎమ్మార్‌ సర్వే ప్రకారం.. 
  ఉత్తరప్రదేశ్‌.. మొత్తం 80 సీట్లు : బీజేపీ - 56, ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ - 20 సీట్లు, కాంగ్రెస్‌- 2
  రాజస్థాన్‌.. మొత్తం 25 సీట్లు: బీజేపీ - 21, కాంగ్రెస్‌ - 4
 • న్యూస్‌-18 - ఐపీఎస్‌ ఓఎస్‌ సర్వే ప్రకారం..
  పశ్చిమ బెంగాల్‌.. మొత్తం సీట్లు 42: తృణమూల్‌ కాంగ్రెస్‌  25 - 28, బీజేపీ 3 -7, ఇతరులు 5 -7
  కర్ణాటక.. మొత్తం సీట్లు 28: బీజేపీ  21-23, కాంగ్రెస్‌-జేడీఎస్‌ 5-3
 • ఇండియా టుడే యాక్సిస్‌ సర్వే ప్రకారం..
  మహారాష్ట్ర.. మొత్తం సీట్లు 48: బీజేపీ  38 - 42, కాంగ్రెస్‌-ఎన్సీపీ 6 - 10
  గుజరాత్‌.. మొత్తం సీట్లు 26 : బీజేపీ 20 - 26, కాంగ్రెస్‌ 0-6
 • ఇండియా టీవీ సర్వే ప్రకారం.. ఢిల్లీలోని ఏడు సీట్లను బీజేపీ క్లీన్‌స్వీప్‌
  (చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే)

 •  
 • న్యూస్‌-18 - ఐపీఎస్‌ ఓఎస్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే : తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌దే పైచేయి అని ఈ సర్వే పేర్కొంది. కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌కు 12-14 సీట్లు వస్తాయని,  కాంగ్రెస్‌కు 1 నుంచి 2 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.
   
 • ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. 
   
 • రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌ :  కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌కు మరోసారి అవకాశం దక్కనుందని రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయేకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 సీట్లు వస్తాయని పేర్కొంది. 
   
 • న్యూస్‌ నేషన్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే:  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు  282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది.
   
 • ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 లోక్‌సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది.
   
 • టైమ్స్‌నౌ - వీఎమ్మార్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపీఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది. 
   
 • న్యూస్‌-18 చానెల్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు రాగా, టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు సున్నా నుంచి ఒక సీటు గెలుస్తారని పేర్కొంది.
   
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-07-2019
Jul 04, 2019, 14:21 IST
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ ప్రకటించింది....
09-06-2019
Jun 09, 2019, 05:00 IST
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్‌కు ఎన్నిక కావడమంటే...
09-06-2019
Jun 09, 2019, 04:52 IST
దేశంలో ఎన్నికలు ఏవైనా నగదు ప్రవాహం మాత్రం యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఖర్చు పెట్టే...
08-06-2019
Jun 08, 2019, 08:12 IST
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు....
08-06-2019
Jun 08, 2019, 04:07 IST
న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్‌ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ...
06-06-2019
Jun 06, 2019, 19:56 IST
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటు వేసిన వారికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలిపింది....
06-06-2019
Jun 06, 2019, 19:54 IST
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి ఓడిపోతారని, సంపన్నులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారు..కానీ...
06-06-2019
Jun 06, 2019, 16:53 IST
చండీగఢ్‌ : మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశానికి డుమ్మా...
06-06-2019
Jun 06, 2019, 15:31 IST
ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారని ఉత్తమ్‌ విమర్శించారు.
06-06-2019
Jun 06, 2019, 14:02 IST
మహా భారతంలో కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఘట్‌బంధన్‌ విఫలమై విడిపోవడానికి...
06-06-2019
Jun 06, 2019, 10:41 IST
స్థానిక నాయకుల వల్లే కుప్పంలో తగ్గిన మెజారిటీ
06-06-2019
Jun 06, 2019, 08:25 IST
 చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ముగ్గురు ఎంపీలు పదవుల కోసం రచ్చకెక్కడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. ...
05-06-2019
Jun 05, 2019, 17:31 IST
తెలుగు దేశం పార్టీలో లోక్‌సభ పదవుల పందేరం చిచ్చు రేపింది.
05-06-2019
Jun 05, 2019, 15:34 IST
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్‌బై చెప్పిన...
05-06-2019
Jun 05, 2019, 13:14 IST
రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
05-06-2019
Jun 05, 2019, 11:45 IST
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి నిప్పులు చెరిగారు. తమ పార్టీతో పెట్టుకుంటే...
05-06-2019
Jun 05, 2019, 09:03 IST
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ...
05-06-2019
Jun 05, 2019, 08:29 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ...
05-06-2019
Jun 05, 2019, 07:52 IST
న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న...
04-06-2019
Jun 04, 2019, 20:13 IST
సొంత పార్టీని ఇరుకునపెట్టేవిధంగా ప్రవర్తించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌పై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top