నిరాహార దీక్షలో పుష్టిగా భుజించిన ప్రధాని | Kushboo in news again | Sakshi
Sakshi News home page

నిరాహార దీక్షలో పుష్టిగా భుజించిన ప్రధాని

Apr 14 2018 7:23 AM | Updated on Aug 15 2018 2:40 PM

Kushboo in news again - Sakshi

పెరంబూరు: నిరాహార దీక్షలోనూ రెండు పూటలా పుష్టిగా భుజించిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీనే అని నటి, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్ర చార కర్త కుష్బూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా గురువారం దేశవ్యాప్తంగా ఒక రోజు నిరా హారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. గురువారం చెన్నైకి వచ్చిన ప్రధాని ఉదయం అల్పాహార సమయం, మధ్యాహ్నం భోజన సమయాన్ని విమానంలోనే గడిపారని కుష్భూ ఆరోపించారు.

అలా రెండు పూటలు శుభ్రంగా ఆహారం లాగించి నిరాహారదీక్ష చేసిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలను మోసం చేయడానికే మోదీ నాటకాలాడుతున్నారని, ఆయన డ్రామాలు ఇక సాగవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. గురువారం చెన్నైకి వచ్చిన మోదీ ఆకాశంలోనే చక్కర్లు కొట్టారని.. అలాంటప్పుడు రోడ్లను ఎందుకు నిర్భంధంచేశారని ప్రశ్నించారు. చెన్నైలో ఒక ప్రాతం నుంచి మరో ప్రాంతానికి కారులో ప్రయాణం చేసే ధైర్యం కూడా మోదీకి లేదని కుష్భూ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement