
కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీ, అలాంటిది..
సాక్షి, హైదరాబాద్ : పరస్పరం బద్ధ శత్రువులైన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. గురువారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసారు. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు తెలుపుతూ తమ పొత్తుపై స్పష్టం చేశారు. అయితే వీరి పొత్తుపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. (చదవండి: ఈ వీణకు శ్రుతి లేదు..)
గతంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తూ చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తూ.. ‘చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకన్నా ఇంకా ఏం మాట్లడలేం’ అని క్యాప్షన్‌గా పేర్కొన్నారు. అయితే టీడీపీ-కాంగ్రెస్ కలయికపై ఆయా పార్టీల సొంత నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీ, అలాంటిది ఇప్పుడు ఇరుపార్టీలు కలిసి పనిచేయడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. (చదవండి: చంద్రబాబు దుర్మార్గుడు)
No comments other than echoing those of @ncbn Garu 👇 pic.twitter.com/gUoV6DakhN
— KTR (@KTRTRS) November 2, 2018