నేను ‘గుత్తా’ను కాదు పార్టీలు మారడానికి : కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy Slams Gutta Sukender Reddy

సాక్షి, యాదాద్రి : పూటకో పార్టీ మారడానికి  నేను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్ష పదివి ఇచ్చినా..ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. నల్గగొండ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఉన్న ఏడాది కాలమైనా మంచి పాలన అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఆ తర్వాత ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇలాంటి పాలన ఉండటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని విమర్శించారు. వాటి గురించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని ఈ సందర్భంగా కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న  సమయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top