ఫాఫం పాల్‌.. పరువు పోగొట్టుకున్నారు!!

KA Paul Gets Very Few Votes in Election - Sakshi

అమరావతి : ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌.. పెద్ద పెద్ద ప్రగల్బాలకు పోతూ.. భారీ ఆడంబరాలతో ఎన్నికల బరిలో నిలబడ్డారు. పచ్చ మీడియా కూడా ఆయనకు బాగానే ప్రచారం కల్పించింది. ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీలో చాలాచోట్ల అభ్యర్థులను నిలిపి.. ప్రచారంలోనూ హడావిడి చేసి.. ఒకింత కామెడీని కూడా పంచారు.  అలాంటి కేఏ పాల్‌ చివరకు తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌సభ స్థానంలో డిపాజిట్‌ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ సమాచారం మేరకు కేఏ పాల్‌కు చాలా తక్కువ ఓట్లు మాత్రమే పడ్డాయి. నరసాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాగా, ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం కేఏ పాల్‌కు మధ్యాహ్నం 11. 48 గంటలవరకు ఉన్న సమాచారం మేరకు కేవలం 407 ఓట్లు పడ్డాయి. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top