మోదీ, జగన్, నవీన్‌లకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

KCR Wishes To YS Jagan Mohan Reddy And Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయ కత్వంలో దేశం మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి కేసీఆర్‌ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షిం చారు. మరోవైపు ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజూ జనతాదళ్‌ అధ్యక్షుడు, సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సీఎం కేసీఆర్, కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలో ఒడిశా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు.  

మీ కష్టానికి ప్రజల ఆశీర్వాదం దక్కింది: కేటీఆర్‌ 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు పడిన కష్టానికి అఖండ మెజారిటీ రూపంలో ప్రజల ఆశీర్వాదం దక్కింది. సాటి తెలుగు రాష్ట్ర పరిపాలనలో మం చి జరగాలని ఆశిస్తున్నా’అని ట్విట్టర్‌లో పేర్కొ న్నారు. ప్రధాన మంత్రి మోదీకి, బీజేపీ  అధ్యక్షు డు అమిత్‌ షాకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపా రు. దేశ ప్రజలు స్పష్టమైన ఆధిక్యంతో ఎన్డీయేకు విజయం కట్టబెట్టారని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  

ఓటర్లకు హరీశ్‌ కృతజ్ఞతలు.. 
మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు మాజీ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్‌ లోకసభ నియోజకవర్గ పరిధి లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసాన్ని కనబర్చారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

మోదీ, జగన్‌లకు హరీశ్‌ శుభాకాంక్షలు 
లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన ప్రధాని మోదీకి, ఏపీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నవయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసేలా పాలన కొనసాగించాలని ఆకాంక్షించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top