రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు

Congress Leaders Comments On CM Chandrababu Naidu Prakasam - Sakshi

సీఎస్‌పురం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని కాంగ్రెస్‌ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి పాశం వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. గురువారం సీఎస్‌పురంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని అయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.  కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా నేలటూరి రమణారెడ్డిని ఎన్నుకున్నారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మెంబర్‌ ఎస్‌బీకే సాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల అధ్యక్షులు తానిగుండాల తిరుపతిరెడ్డి, ఎస్‌కే మహబూబ్‌బాషా, ఖాశిం, రంగనాయకులు, ఏసోబు, ప్రసాదరెడ్డి, టీబీకే సుబ్బారావు, మీరామొహిద్దీన్, శివ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top