ఈసీవి డ్రామాలు

Chandrababu Fires On Election Commission Of India - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

50 శాతం వీవీ ప్యాట్స్‌ లెక్కించడానికి ఇబ్బంది ఏమిటి?

మీరు డిక్టేటర్‌ అయితే ఎంపీ, ఎమ్మెల్యేలను మీరే నియమించుకోండి

నిన్నటి వరకు నా దగ్గర పనిచేసిన ద్వివేది ఎక్స్‌పర్టా?

దేశంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఉందా?

ఈవీఎంలను మేనేజ్‌ చేయడం తేలిక

ఈవీఎంలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయి కార్యాచరణ

మోదీ హెలికాప్టర్‌లో డబ్బులు తీసుకుపోతున్నారు

ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలనుకుంటున్నారు

సాక్షి, అమరావతి: పేపర్‌ బ్యాలెట్‌కు ఉన్న సౌలభ్యాన్ని చూడకుండా ఈవీఎంల విషయంలో ఈసీ ఎందుకు ఇన్ని డ్రామాలాడుతోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మీరే డిక్టేటర్‌ అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలను మీరే నియమించుకోండని విమర్శించారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీ పంపిస్తే ఈసీ చదివిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికలను గతంలో కంటే విరుద్ధంగా ఎందుకు ముందుగా పెట్టారంటే సమాధానం లేదన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసి భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. వీవీ ప్యాట్స్‌ విషయంలో లెక్కింపు కుదరదనడానికి ద్వివేది ఏమైనా ఎక్స్‌ఫర్టా? ఆయన నిన్నటి వరకు నా దగ్గర పని చేయలేదా? అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ప్రమోట్‌ చేసింది తానేనని, సాంకేతిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చానని చెప్పారు.

ఈవీఎంలను మేనేజ్‌ చేయడం చాలా సులువని అన్నారు. 191 దేశాలకుగాను 18 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయన్నారు. జర్మనీ, నేదర్లాండ్, ఐర్లాండ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం గతంలో వాడి ఇప్పుడు వెనక్కు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఈవీఎంల వినియోగం తీరుపై ఈ సందర్భంగా ఆయన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. 2009 నుంచి ఈవీఎంలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. పోలింగ్‌ రోజునే అవకతవకలు జరుగుతూంటే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరగడం ఏమిటని, ఎన్నికల సంఘం ఎక్కడ సజావుగా ఎన్నికలు జరిపిందని ప్రశ్నించారు. ఈవీఎం యంత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా సమీక్షించే సరైన వ్యవస్థ లేదన్నారు.

నా ఓటు ఎవరికి పడిందో?
వీవీ ప్యాట్‌లలోను ఓటు ఎవరికి వేశామనేది ఏడు సెకన్లు కన్పించాల్సి ఉండగా, మూడు సెకన్లు కూడా కనిపించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు ఎవరికి వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికలకు ముందుగానే తమకు ఈవీఎంలపై అనుమానాలున్నాయని చెప్పామని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు బ్యాలెట్‌ అంటే సమయం సరిపోదన్నారని, అందువల్ల 100 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్‌ చేశామన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కౌంట్‌ చేయనప్పుడు వాటికి రూ.9 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అడిగారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత తీసుకు రావడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేస్తే సారీ అనే ఒక్క పదంతో ఈసీ తేల్చేసిందన్నారు. అసలు ఈ దేశంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ విధానంపై అందరికీ స్పష్టత ఉండాలని, ఎన్నికల సంఘం ముందు అనేక అంశాలు వివరించామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఇందుకు ఐక్య కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా 23 రాజకీయ పార్టీలు జాయింట్‌ పిటిషన్‌ వేశాయని చెప్పారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని ఈసీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు ఎందుకు పడుతుందని, ఈ విధానంపై సుప్రీంకోర్టుకు కొత్త పిటిషన్‌ (రివ్యూ పిటిషిన్‌) వేస్తామన్నారు. 

150 సీట్లకు పైగా గెలుస్తాం..
ఈవీఎంలపై తాను మాట్లాడుతుంటే తాము ఓడిపోతామనే అనుమానాలు రేపుతున్నారని చంద్రబాబు అన్నారు. ‘గెలుపు విషయంలో నేను భయపడటమేంటి? మేమెందుకు ఓడిపోతాం? ఎలా ఓడిపోతాం? ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి ఒక స్ఫూర్తితో ఓటేశారు. ఎవరెన్ని మాట్లాడుతున్నా అండర్‌ కరెంట్‌ చూడబోతున్నారు. 150కి పైగా సీట్లలో మేమే గెలుస్తాం. మోదీ ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలనుకుంటున్నారు. హెలికాఫ్టర్‌లో డబ్బులు తీసుకుపోతున్నారు. మోడల్‌ కోడ్‌ మోదీకి వర్తించదా? మొత్తం వ్యవస్థను మోదీ భ్రష్ట్రు పట్టించారు. నేరస్తులకు ఆయన చౌకీదారు. పెద్ద నోట్లు రద్దు చేసి మళ్లీ రూ.2 వేలు తేవడం ద్వారా వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. రాఫెల్‌ విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారు’ అన్నారు. పాకిస్తాన్‌పై దాడుల విషయంలో కూడా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు

19-04-2019
Apr 19, 2019, 03:06 IST
చెన్నై నుంచి తిరుపతి వైపు తరలిస్తున్న 1,381 కేజీల బంగారాన్ని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు అధికారులు బుధవారం రాత్రి...
19-04-2019
Apr 19, 2019, 00:54 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి యథేచ్ఛగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ ఓట్లు కొనుగోలు పథకాలకు రాష్ట్ర ఖజానా...
19-04-2019
Apr 19, 2019, 00:44 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ భారీ కుట్రలో భాగంగానే రాష్ట్రంలో 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి...
19-04-2019
Apr 19, 2019, 00:26 IST
లోక్‌సభ ఎన్నికలంటే అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా దీనికి పేరుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 80...
18-04-2019
Apr 18, 2019, 20:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు అతీతంగా పని చేస్తుందని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార...
18-04-2019
Apr 18, 2019, 20:52 IST
సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు పోలీసులు బుధవారం సీజ్‌ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముంగిట...
18-04-2019
Apr 18, 2019, 19:17 IST
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని..
18-04-2019
Apr 18, 2019, 18:59 IST
న్యూఢిల్లీ : బీజేపీ నాయకుడు జీవీఎల్‌ నరసింహారావు ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయనపై శక్తి భార్గవ అనే వ్యక్తి...
18-04-2019
Apr 18, 2019, 18:54 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని ఏపీ డిప్యూటీ కలెక్టర్‌ అసోసియేషన్‌ సభ్యులు గురువారం కలిశారు. ఎన్నికల...
18-04-2019
Apr 18, 2019, 18:32 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దూరంగా ఉన్నారు.
18-04-2019
Apr 18, 2019, 18:07 IST
కేంద్ర మంత్రి నక్వీకి ఈసీ వార్నింగ్‌
18-04-2019
Apr 18, 2019, 18:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశ పోలింగ్‌ ముగిసింది. చెదురు మదురు సంఘటన తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రెండోవిడత...
18-04-2019
Apr 18, 2019, 17:44 IST
పూనం నామినేషన్‌ కార్యక్రమానికి శత్రుఘ్న సిన్హా హాజరు
18-04-2019
Apr 18, 2019, 16:38 IST
కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ముఖేష్‌ అంబానీ
18-04-2019
Apr 18, 2019, 16:07 IST
పట్నా : దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా...
18-04-2019
Apr 18, 2019, 15:50 IST
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వైఎస్సార్‌సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి...
18-04-2019
Apr 18, 2019, 15:48 IST
తిరువనంతపురం : ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలకు అతీతంగా ‘మగానుభవులైన’ నాయకులు మహిళల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం...
18-04-2019
Apr 18, 2019, 15:43 IST
సాక్షి, అమరావతి : యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం...
18-04-2019
Apr 18, 2019, 15:25 IST
శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో రాజకీయ వారసులు ఒమర్‌ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీ మరోసారి ట్వీట్‌ వార్‌కు దిగారు.  ఈసారి...
18-04-2019
Apr 18, 2019, 15:04 IST
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముగిసినప్పటికీ అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తున్న టీడీపీ సర్కార్‌... ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top