‘ఇది రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా?’

C Rama Chandraiah Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి అని, విభజనకు ముందు సోనియా దెయ్యమని, రాహుల్‌ గాంధీ అని పనికిరాని వ్యక్తి అని ఇప్పుడేమో సోనియా గొప్ప నాయకురాలు, రాహుల్‌ విజన్‌ ఉన్న నేత అని చెప్పడం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్‌తో సిగ్గు లేకుండా చేతులు కలిపారంటూ విమర్శించారు. 

విభజన తరువాత కాంగ్రెస్‌ అధినేతలు రాష్ట్రానికి వస్తే.. నిరసనలు తెలిపి.. ఇప్పుడు వాళ్లను పొగుడుతున్నారని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాటకాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పారదర్శకత అనేది లేకుండా రహస్యంగా జీవో జారీ చేశారంటూ దుయ్యబట్టారు. ఇంతటి ఘోరమైన పాలన దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అప్పులు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగానికి విరుద్దంగా నడుచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఓట్లు అడగలేని చంద్రబాబు.. పక్క రాష్ట్రాలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top