హస్తినలో ఆధిక్యత ఎవరిది?

BJP Will Win All Seven Seats Exit Polls - Sakshi

ఏడు స్థానాల్లోనూ బీజేపీ విజయం

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఉత్కంఠ భరింతంగా సాగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ సొంతం చేసుకుని గత ఫలితాలను పునరావృత్తం చేస్తుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలను ఢిల్లీ ఓటర్లు ఈసారి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌లో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే ఊపు జాతీయ రాజధానిలో కూడా కొనసాగించింది. ఇండియా టుడే వెల్లడించిన సర్వేలో మాత్రం బీజేపీ 6-7, కాంగ్రెస్‌ 0-1 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆప్‌-కాంగ్రెస్‌ మధ్య పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేయడం ఆయా పార్టీలకు నష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలైన షీలా దీక్షిత్‌, అజయ్‌ మాకెన్‌కు కూడా ఓటమి తప్పదని సర్వే ఫలితాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top