చదువు‘కొనేలా’ మార్చిన ఘనత కేసీఆర్‌దే

BJP President Laxman Slams CM KCR - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వస్తే కామ న్‌ స్కూల్‌ విద్యావిధానం తీసుకొస్తానని సీఎం కేసీఆర్‌ ప్రగల్భాలు పలికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. తన మనుమడు, తన డ్రైవర్‌ కొడుకు ఒకే పాఠశాలలో చదివే విద్యావిధానం తెస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తున్నారని, ఆయన చెప్పిన కామన్‌ స్కూల్‌ విధానం ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, కార్పొరే ట్‌ విద్యా విధానానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘చదువుకుందాం’నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

ఫీజుల కలెక్షన్‌ విషయంలో దేశంలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటివరకు దాదాపు 400 శాతం ఫీజు పెరిగిందని చెప్పారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న నియమాన్ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డీటెయిన్‌ చేస్తున్నారన్నారు. మూడేళ్ల పిల్లలకు బ్యాగు బరువు తప్పడం లేదని, విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుంటోందని అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలను తమ యువజన విభాగం సేకరించిందని చెప్పారు. వారంలోగా ఆయా విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకోకపోతే వారి పనిపడతామని లక్ష్మణ్‌ హెచ్చరించారు.  

మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని లక్ష్మణ్‌ ఆరోపిం చారు. గత పాలకులు 60 ఏళ్లలో చేసిన అప్పులని కేసీఆర్‌ ఆరేళ్లలోనే చేశారన్నారు. మజ్లిస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top